ETV Bharat / state

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల భర్తీపై తుది కసరత్తు - కేసీ వేణుగోపాల్​తో చర్చించనున్న రేవంత్‌ - కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ

Congress MLC Candidates Finalized Today : రాష్ట్రంలో నాలుగు ఎమ్మేల్సీ స్థానాల్లో అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు ఛైర్మన్ల ఎంపిక ఇవాళ కొలిక్కి రానుంది. దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించనున్నారు. రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్షీ, సునీల్ కనుగోలుతో కలిసి కేసీ వేణుగోపాల్​తో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ చైర్మన్లపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Congress MLC Candidates Finalized Today
Congress MLC Candidates
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 7:20 AM IST

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల భర్తీపై తుది కసరత్తు - కేసీ వేణుగోపాల్​తో చర్చించనున్న రేవంత్‌

Congress MLC Candidates Finalized Today : కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశం తుదిదశకు చేరింది. పేర్లు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కోట కింద రెండు, ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌, దీపా దాస్ మున్షీ, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శులు ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీప దాస్‌మున్షి, సునీల్ కొనుగోలు ఇచ్చినట్లు సమాచారం.

నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు

Congress MLC Candidates : దీనిపై చర్చించిన ఈ ముగ్గురు నిర్ణయానికి వచ్చిన పేర్లపై ఇవాళ కేసీ వేణుగోపాల్‌తో సమాలోచనలు జరపనున్నారు. అనంతరం తుదిజాబితాపై అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇవ్వాల్సి ఉండగా మిగిలిన మూడు బీసీ, మైనార్టి, ఓసీకి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎంపిక పూర్తి కాగానే ఈ నెల 18 లోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. శాసనసభలో ఉన్న బలాబలాలను పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటా రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్ బయటకు రావాలి : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం : నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ ప్రధాన పదవులను అర్హులైన నాయకులకు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అదే జాబితాను కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ, పౌరసరఫరాల, మైనింగ్ ఆబ్కారీ, టీఎస్​ఐఐసీ, ఆగ్రో, రైతుబంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, మత్స్య కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, తదితర ముఖ్యమైన 20కి పైగా కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

CM Revanth Reddy : ఇందులో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన, పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నామినేట్ పదవులు సంబంధించి కూడా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మణిపూర్ నుంచి రేపు ప్రారంభం కానున్న రాహుల్‌గాంధీ భారత్ న్యాయ్‌ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి దిల్లీ చేరుకుని మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందంతో కలిసి దావోస్ వెళ్లమన్నారు. నాలుగు రోజులు దావోస్‌, ఒక రోజు లండన్‌లో పర్యటించి తిరిగి ఈనెల 20న తిరిగి హైదరాబాద్‌ రానున్నారు.

మహిళా​ ఎమ్మెల్సీపై దాడి.. ప్రజలతో మాట్లాడుతుండగా చెంపదెబ్బ

'ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అమిత్‌ షాతో సుప్రీం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.