ETV Bharat / state

కాంగ్రెస్‌లో అసమ్మతి నాయకులకు కళ్లెం- ఒకట్రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు - Telangana Congress latest news

Congress MLA Tickets Issues in Telangana 2023 : టికెట్లు రాక నిరాశకులోనైన నాయకుల అసమ్మతికి కళ్లెం పడినట్లేనని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఒకట్రెండు చోట్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు నియంత్రణలోకి వచ్చినట్లు.. పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రకటించాల్సిన నాలుగు నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపాయి. పటాన్‌చెరు అభ్యర్థి ప్రకటన తర్వాత చెలరేగిన అసమ్మతి ఇద్దరు నేతల మధ్య.. అంతరం తీవ్రస్థాయికి చేరడం ఆందోళన కలిగించేట్లుగా ఉందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి.

Congress
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 7:12 AM IST

కాంగ్రెస్‌లో అసమ్మతి నాయకులకు కళ్లెం

Congress MLA Tickets Issues in Telangana 2023 : కాంగ్రెస్‌లో టికెట్‌ ప్రకటన సందర్భంగా చెలరేగిన అసమ్మతి క్రమంగా సర్దుకుంటోంది. టికెట్‌ వస్తుందని ఆశించిన నేతల్లో కొందరు పార్టీని వీడగా.. మరికొందరు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. ఇంకొందరు పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులతో కలిసి పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 4 చోట్ల కాంగ్రెస్‌, ఒక్కచోట సీపీఐ అభ్యర్థులని ప్రకటించాల్సి ఉంది.

మూడో జాబితాలో వనపర్తి, బోథ్‌ అభ్యర్థులని మార్చారు. వనపర్తిలో పేరు మార్పుపై గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి (EX Minister Chinna Reddy)నిరసన వ్యక్తంచేశారు. చేవెళ్ల అభ్యర్థి భీం భరత్‌పై.. అందిన పలు అభియోగాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన ఏఐసీసీ.. ఆయనకు బీ ఫాం ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రకటించిన 114 సీట్లల్లో కేవలం 23 మంది బీసీలున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలో నర్సాపూర్‌ అభ్యర్థిని మార్చాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అభ్యర్థిని మార్చి గాలి అనిల్‌కుమార్‌కు కేటాయిస్తే మరో బీసీ సీటు మరోకటి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న అసమ్మతి సెగ-మూడో జాబితా ప్రకటనతో చెలరేగిన ప్రకంపనలు

Telangana Congress MLA Tickets Disputes : ఈ నేపథ్యంలోనే ఆ సీటు మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న అభ్యర్థికే టికెట్‌ ఉంచాలంటూ దిల్లీ స్థాయిలో కొందరు చక్రం తిప్పుతుండడంతో.. అలాగే ఉండిపోయింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు.. గాలి అనిల్‌ కుమార్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించి నామినేషన్ వేశారు. నిన్న సాయంత్రం.. ఆ నియోజకవర్గ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరగా అందుకు అంగీకరించినట్లు సమాచారం.

ఇంకా ఎక్కడైనా పార్టీతో కలిసి రాని వాళ్లను సమన్వయ కమిటీ సభ్యులు.. ఏఐసీసీ పరిశీలకులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్‌ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించకుండా ఉంచింది. అందులో చార్మినార్‌ను ఓ మైనార్టీ ఎమ్మెల్యే చేరిక కోసం ఉంచినట్లు తెలుస్తోంది. సీపీఎం తెగతెంపులు చేసుకొని ఒంటరిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకొని.. 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Telangana Assembly Elections 2023 : అయినా సీపీఎంతో పొత్తుల కోసం చివరి క్షణాల వరకు వేచిచూసే ధోరణిలో.. హస్తం పార్టీ ముందుకెళ్తోంది. సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకునేందుకు సర్వేలు చేయించినట్లు సమాచారం. ఆ సర్వేల్లో ఎవరికి ఎక్కువ బలం ఉందని తేలితే వారికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. పటాన్‌చెరు అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌ను వ్యతిరేకిస్తూ... కాటం శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులు ఆందోళన చేశారు. జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి (PCC President Revanth Reddy) వ్యతిరేకంగా నినదించడంతో.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏదైనా ఉంటె రాజకీయాల్లో తేల్చుకోవాలని.. బద్నాం చేయడం సరైనది కాదని ఆయన హితవు పలికారు.

సత్తుపల్లి స్థానాన్ని కంభాని చంద్రశేఖర్‌కి కేటాయించకపోవడంతో.. ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో సమావేశమైన ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూకుమ్మడి రాజీనామాలను సంభాని చంద్రశేఖర్‌కి కార్యకర్తలు అందించారు.

Congress MLA Ticket Issues in Telangana : కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి ముఖ్యనేతలు

Telangana Congress MLA Tickets Disputes 2023 : పాలమూరు హస్తంలో అసమ్మతి.. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకుని భంగపడ్డామని నేతల అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.