ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి ప్రశంసలు

తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సీనియర్​ కాంగ్రెస్​ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే...  కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో తెరాస వాదనతో సంపూర్ణంగా ఏకీభవించారు.

author img

By

Published : Jun 19, 2019, 4:46 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు తీరతాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి హయాంలో జరిగినా హర్షించాల్సిందే అన్నారు. కాళేశ్వరంలో అవినీతి గురించి తనకు తెలియదన్న జగ్గారెడ్డి....ఆ విషయం సీల్పీ నాయకుడు భట్టి చూసుకుంటారని పేర్కొన్నారు.

అవి నింపితే కేసీఆర్​ను సన్మానిస్తా...

నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, సింగూర్, మంజీరా లాంటి ప్రాజెక్టులను కట్టిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ఏ సీఎం ప్రాజెక్టులు నిర్మించినా ప్రజలు.. రైతుల కోసమే అన్నారు జగ్గారెడ్డి. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వబట్టే... కాళేశ్వరం కట్టగలిగామన్నారు. ఈ ఏడాదిలోనే కాల్వలు తవ్వి సింగూరు, మంజీరాలను నింపాలని కోరారు. సింగూరు, మంజీరాలను నింపితే ప్రజల పక్షాన కేసీఆర్‌ను సన్మానిస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రారంభానికి జగన్‌, ఫడణవీస్‌ను పిలవడంలో తప్పులేదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.

ఇవీచూడండి: తెలంగాణలో పాతాళంలోకి భూగర్భజలాలు

Intro:TG_KRN_102_19_MLA_SAMUHIKA_ AKSHARA ABYASA_KARYAKRAMAM_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దేపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. గాయకుడు గడిపే బాలయ్య ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ పాడిన పాట ఎమ్మెల్యేను , విద్యార్థులను , ఉపాధ్యాయులను , వీక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు పాఠ్య పుస్తకలు మరియు ఏక రూప దుస్తులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, హుస్నాబాద్ లొనే 200 మందికి పైగా విద్యార్ధుల ను ఈ పాఠశాల కలిగి ఉండడం గమనార్హం అని, పాఠశాల గదులు సరి పోవడం లేదంటూ ఉపాద్యాయులు తన దృష్టికి తీసుకువచ్చారని సంబంధిత అధికారులతో మాట్లాడి అదనపు తరగతి గదులను నిర్మింప చేయిస్తానని హామీ ఇచ్చారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:హుస్నాబాద్ లోని ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.