Double Trouble Controversies in Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త తరహా వివాదం తెరపైకి వస్తోంది. కుటుంబానికి రెండు టికెట్లు వ్యవహారం పార్టీలో ట్రబుల్స్‌కు దారి తీస్తోంది. గత కొన్ని రోజులుగా ఒక్కో కుటుంబానికి రెండు టికెట్లు కావాలన్న డిమాండ్ కాంగ్రెస్(congress) పార్టీలో క్రమంగా పెరుగుతోంది. నా కుమారుడికి, నా కూతురుకి, నా భార్యకు టికెట్ కావాలంటూ పలువురు సీనియర్ నాయకులు తెరపైకి వస్తున్నారు.
కాని ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక్కో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు నాయకులు తమతోపాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని పట్టుబడుతూ వస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే చందాన.. తాము రాజకీయాల్లో ఉండగానే వారసులను ప్రయోజకులను చేయాలన్న యోచనలో పలువరు సీనియర్లు ముందుకు వెళ్లుతున్నారు.
Double Ticket Issues in Congress Party : ఇందులో భాగంగా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి తనతోపాటు తన ఇద్దరు కుమారులకు సీట్లు కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఒక సందర్భంలో ఇస్తే తన ఇద్దరు కుమారులకు టికెట్‌లు ఇవ్వాలని.. లేదంటే తనకు ఒక్కరికే ఇవ్వాలని, వారిలో ఒక్కరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ఆయనతో పాటు.. ఆయన భార్య పద్మావతిరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తిరిగి కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, హుజూర్నగర్ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాహబూబాబాద్ నుంచి పోటీకి దరఖాస్తు చేయగా.. ఆయన కుమారుడు సాయిశంకర్ నాయక్ ఇల్లందు నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు.
Udaipur Declaration on Tickets Allotment : ఎమ్మెల్యే సీతక్క ములుగు నుంచి, ఆమె కుమారుడు సూర్య పినపాక నుంచి పోటీ చేసేందుకు అర్జీలు పెట్టుకున్నారు. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొండా మురళి పరకాల నుంచి, మాజీ మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నుంచి బరిలో దిగేందుకు అర్జీలు పెట్టుకున్నారు. దంపతులు ఇద్దరు తమకు రెండు టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు.
Interview with Jagga Reddy : 'ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై సమావేశంలో చర్చే జరగలేదు'
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, అయన కూతురు త్రిష రాజనర్సింహ ఇద్దరు కూడా అందోల్ నియోజకవర్ర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కూడా తన ఇద్దరు కుమారులు ఇద్దరికీ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇబ్రహీంపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ నుంచి ఆయన సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి దరఖాస్తు చేశారు.
Telangana Congress Latest News : ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్, తన భార్య రేఖానాయక్‌కు కూడా టికెట్ కావాలంటూ ఇద్దరు దరఖాస్తులు చేశారు. అదేవిధంగా ఇటీవల మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. మంత్రి హరీష్‌రావుపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాని ఆయన తనతోపాటు తన కుమారుడు రోహిత్‌కు కూడా టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే హన్మంతరావు కోరినట్లు మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇవ్వడానికి పీసీసీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయ్యితే మెదక్ ఎమ్మెల్యే టికెట్‌తోపాటు, మల్కాజిగిరి ఎంపీ టికెట్‌కాని, కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌కాని ఇచ్చేందుకు పీసీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Revanthreddy Fires on Double Ticket Allotments : గాంధీభవన్‌లో నిన్న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీలో కుటుంబంలో ఇద్దరు టికెట్లు విషయమై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దానిపై తానేమీ నిర్ణయం తీసుకోలేనని పీఈసీ ఛైర్మన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డినే నిర్ణయం తీసుకుని అధిష్ఠానాన్ని ఒప్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడంతోపాటుత.. తనను డిక్టేట్ చేసే తీరులో ఎవరు మాట్లాడవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అసహనానికి గురై బయటకు వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీడియాలో కూడా ఇదే విషయం హల్చల్ చేసింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం తమ స్థాయిలో ఈ విషయమై ఏలాంటి నిర్ణయం తీసుకునేది ఉండదని స్పష్టం చేస్తున్నారు. మరొకవైపు ఉదయ్‌పూర్ డిక్లరేషన్.. కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డబుల్ నినాదం కాంగ్రెస్ పార్టీని ట్రబుల్స్ లోకి నెట్టే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy challenged BRS : 'ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్‌ఎస్ ఓట్లు అడగకూడదు..'