ETV Bharat / state

Congress MLA Candidates Second List in Telangana : ఈ నెల 21 తర్వాతే కాంగ్రెస్​ అభ్యర్థుల రెండో జాబితా.. 9 స్థానాల ఎంపికకు కసరత్తు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Congress MLA Candidates Second List in Telangana 2023 : తొలి విడత బస్సుయాత్ర తర్వాతనే రెండో జాబితా ఉంటుందని.. కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 110 నియోజక వర్గాలకు స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు పూర్తి చేసినా వివాదం లేని సగం స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. దాదాపు 30 చోట్ల గట్టి పోటీ ఉండడంతో సంప్రదింపులు చేసే బాధ్యతని జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీకి ఏఐసీసీ అప్పగించింది. ఈనెల 21 తర్వాత.. ఎప్పుడైనా రెండో జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023
Congress Bus Yatra Starting Date in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 8:22 AM IST

Congress Second List in Telangana ఈ నెల 21 తరవాతే కాంగ్రెస్​ అభ్యర్థుల రెండో జాబితా.. 9 స్థానాల ఎంపికకు కసరత్తు

Congress MLA Candidates Second List in Telangana 2023 : మొదటి జాబితా విడుదలైన తర్వాత పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగుతుందని.. రాష్ట్ర కాంగ్రెస్‌(Congress) అంచనా వేసినా అలాంటిదేమీ జరగలేదు. నాలుగైదు చోట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు అధికారంలోకి వచ్చాక లబ్ది చేకూరుతుందని భావించి.. వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్​ఎస్​ టికెట్లు ప్రకటించడం సహా బీజేపీలో గెలిచే అవకాశాలు లేవన్న ప్రచారంతో.. పార్టీలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక కోసం.. నాలుగుసార్లు సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ దాదాపు 110 నియోజకవర్గాలకు కసరత్తు పూర్తిచేయగా.. తొలి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది.

Congress Second List in Telangana 2023 : మిగిలిన 64 స్థానాల్లో 9 మినహా అన్నింటిపై కసరత్తు పూర్తైనట్లు సమాచారం. ఆ 9 చోట్ల వామపక్షాలతో పొత్తు, ఐదాగురుగురు పార్టీలో చేరేవారుండడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపిన కాంగ్రెస్‌.. నాలుగైదు రోజుల్లో మొత్తం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. దాదాపు 30 చోట్ల అభ్యర్థుల ఎంపికలో.. తీవ్రమైనపోటీ నెలకొనడంతో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత ప్రకటించడం మంచిదని పీసీసీ, ఏఐసీసీ భావిస్తోంది.

Congress Foremen Committee : అసంతృప్తుల బుజ్జగింపుపై అధిష్ఠానం ఫోకస్​.. జానారెడ్డి నేతృత్వంలో ఫోర్​మెన్ కమిటీ ఏర్పాటు

Congress Bus Yatra in Telangana : ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ.. ఈనెల 18 నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 18న.. రామప్ప దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసి.. బస్సుయాత్ర ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజు భూపాలపల్లిలో మహిళలతో.. ఈనెల 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో.. ప్రత్యేక సమావేశాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. 20న జగిత్యాల, బోధన్, నిజామాబాద్‌లలో.. బస్సుయాత్ర, సభలుంటాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు విడతలుగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Thummala Nageswara Rao Meets Rahul Gandhi : దిల్లీలో రాహుల్​ గాంధీతో తుమ్మల నాగేశ్వర రావు భేటీ

Congress Screening Committee in Delhi : బస్సు యాత్ర ప్రచారంలోపే గట్టిపోటీ ఉన్న దాదాపు 30 స్థానాలకి చెందిన నాయకులతో జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయకమిటీ మాట్లాడి.. సంప్రదింపులు పూర్తి చేసి నివేదించే అవకాశం ఉందని పీసీసీ, ఏఐసీసీ భావిస్తోంది. అప్పటివరకు వామపక్షాలతో పొత్తులు, చేరికలు పూర్తవుతాయని భావిస్తోంది. తొలివిడత బస్సుయాత్ర పూర్తవుతుండటంతో ఈనెల 21న దిల్లీలో స్క్రీనింగ్‌కమిటీ(Screening Committee) సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోసారి కసరత్తు చేసి మిగిలిన 64 నియోజకవర్గాలకు చెందిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది. అందులో అన్నింటికి సీఈసీ ఆమోద ముద్ర వేసి ఒకేసారి అన్నింటిని ప్రకటిస్తుందా లేక మరో రెండు విడతల్లో ప్రకటిస్తుందా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress MLA Candidates First List 2023 : 58 మందితో రేపు కాంగ్రెస్​ తొలి జాబితా.. సీపీఐ, సీపీఎంలకు చెరో 2 సీట్లు!

Congress MLA Candidate List 2023 : ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సై.. మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.