Congress Ministers Counter on KTR : రాష్ట్రంలో అధికారంలో కోల్పోయినా, బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పులేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణలో మార్పు కావాలనే ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ రెండోసారి గెలిచాక మంత్రులు లేకుండా, 2నెలల పాటు పాలించారని అన్నారు. ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ పాలన సాగించారని మండిపడ్డారు.
'ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ పాలన సాగించారు. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 48 గంటల్లోనే అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పటికే రూ.6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయి. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాం. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు'- శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్
Sridhar Babu Fires on BRS Past Ruling : బీఆర్ఎస్ నేతల వైఖరి నవ్విపోదురుగాక, నాకేంటి అన్నట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఓటమిపాలైనప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 3500 రోజులు పాలించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాలేదని అప్పుడే సర్కార్‌పై కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని విరుచుకుపడ్డారు. మిగత హామీల అమలు కోసం ఓవైపు దరఖాస్తులు స్వీకరిస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వారిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడవదని, వారంత ఒకసారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని శ్రీధర్ బాబు సూచించారు.
Minister Seethakka Satires on BRS Party : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అంటే 420, 420 అంటే బీఆర్ఎస్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ అని తప్పుడు ప్రచారాలను, దుర్మార్గపు విధానాలను ఎండగట్టడుతూ బీఆర్ఎస్ అడ్రెస్ లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
"మోసం చేశారని ప్రత్యేకంగా బీఆర్ఎస్ గురించి చెప్పాలి కానీ, ఇక్కడ మా ముందు ఉన్న మీడియా సోదరులకు ఇండ్లు ఇస్తానని మోసం చేసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్దే. మరి 420 అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే 420. పేరు మార్చుకుంటే 420 పోతదని మార్చుకున్నారు. కానీ అది కొనసాగుతుంది. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుసు." - సీతక్క, గిరిజనశాఖ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో 'నంబర్ వన్ 420' కేసీఆర్ : జీవన్ రెడ్డి
కేసీఆర్ పాలనలో రెవెన్యూ శాఖ ఛిన్నాభిన్నం అయింది : ప్రొ.కోదండరాం