గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీభవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీలు సమావేశమయ్యాయి. వీరు జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపనున్నారు.
అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చించారు. రేపు సాయంత్రానికి జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ, కుసుమకుమార్, పొన్న ప్రభాకర్, వీహెచ్, గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.