ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్​ కసరత్తు - మున్సిపల్​ ఎన్నికలు

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మున్సిపాల్టీల్లో ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్​ కసరత్తు
author img

By

Published : Aug 8, 2019, 3:23 PM IST

రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులు గాంధీభవనలో సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో మొదలైన సమీక్ష సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీమ్‌ అహ్మద్‌, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, కుసుమకుమార్‌, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇంటింటికి కాంగ్రెస్‌, వాడవాడలా జెండా కార్యక్రమం విజయవంతమైనట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి... అన్ని స్థాయిల్లో కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్​ కసరత్తు

ఇదీ చూడండి: పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.