Congress Manifesto Campaign in Telangana 2023 : తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలతోనే ప్రచారం నిర్వహిస్తూ వచ్చింది. శుక్రవారం మేనిఫెస్టో(Congress Manifesto) విడుదల చేసిన కాంగ్రెస్ ఇకపై బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు ప్రయోజనకారిగా ఉండేట్లు మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు అంచనా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిని జనంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది.
అభయహస్తం పేరిట - 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Telangana Assembly Elections 2023 : ఓటర్లను ఆకర్శించి పార్టీకి ఓట్ల శాతాన్ని పెంచేట్లు ఉందని భావిస్తున్న కాంగ్రెస్(Congress Party) ఇది జనంలోకి వెళ్లితే.. ఇప్పుడున్న కంటే మరింత ప్రజాధరణ లభిస్తుందని అంచనా వేస్తోంది. ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీనీ ఉవ్వెత్తున లేపినట్లు అంచనా వేస్తున్న పీసీసీ.. ఈ మేనిఫెస్టో పార్టీని మరింత జనాదరణకు దోహదం చేస్తుందని ఇతర పార్టీల కంటే తాము ప్రకటించిన మేనిఫెస్టో అంశాలకు ఎక్కువ ఆకర్శితులవుతారని భావిస్తోంది.
Congress Election Campaign : 37 అంశాలతో 42 పేజీల్లో ప్రకటించిన భారీ మేనిఫెస్టో.. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలతోపాటు అన్ని సామాజిక వర్గాలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. యువతకు చేయూత, మహిళకు సాధికారిత, జాబ్ క్యాలండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లాంటి హామీలు ఓటర్లను పార్టీకి దగ్గర చేసేవిగా ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ఉద్యోగస్తులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు, సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాల నిబంధనల సరళీకరణ, అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల రూపకల్పన, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, రేషన్ కార్డు ఉన్న వారందరికి సన్నబియ్యం వంటి పథకాలు ఓటర్ల అభిమానాన్ని చురగొంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ధరణి స్థానంలో 'భూమాత'.. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ - రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో
ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలనే ఎక్కువగా ప్రచారం చేయాలని నిర్ణయిచింది. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికలకు యాడ్స్ ఇవ్వడం, టీవీలల్లో, సామాజిక మాద్యమాలల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యాడ్స్ ఇవ్వడం ద్వారా మేనిఫెస్టో అంశాలు జనంలోకి త్వరగా వెళ్లతాయని భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒకెత్తు అయ్యితే.. ఇప్పటి నుంచి జరనున్నది మరింత విస్తృతంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ తప్పుడు మాటలు చెప్తున్నారు : రేవంత్ రెడ్డి