ETV Bharat / state

ఆలస్యం అయ్యేనా!

లోక్​సభ సీటు కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి రెండు నుంచి మూడు పేర్లతో కూడిన జాబితా అధిష్ఠానానికి చేరింది. తుది జాబితా కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఎదురుచూపుల పర్వం కొనసాగేనా..?
author img

By

Published : Mar 2, 2019, 4:29 AM IST

Updated : Mar 2, 2019, 6:54 AM IST

తెలంగాణలోని 17 లోక్​సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఫిబ్రవరి నెలాఖరు లోపు ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినప్పటికీ.... మరో నాలుగైదు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆశావహుల నుంచి అందిన 380 దరఖాస్తులను డీసీసీ, పీసీసీ, స్థాయిల్లో వడపోత ప్రక్రియ అనంతరం... జాబితాను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సిద్ధం చేసింది. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురి పేర్లను ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలుఏఐసీసీకి అందజేశారు.
రాష్ట్ర నాయకులతో కలిసి ఈ జాబితాపై ఏఐసీసీ ఎన్నికల కమిటీ చర్చించినప్పటికీ... రాహుల్ గాంధీ అనుమతి పొందలేదు. భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా నాలుగైదు రోజుల్లో... దిల్లీ పెద్దలు మరోసారి చర్చించి, రాహుల్‌ పరిశీలన తరువాత తుది జాబితా వెలువడే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి:"దేశం గర్విస్తోంది"

కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా....

ఆదిలాబాద్‌ నుంచి.... ఆత్రం సక్కు, సోయం బాబూరావు, రమేష్‌ రాథోడ్‌
నిజామాబాద్‌ నుంచి.... మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సుదర్శన్‌ రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, అనిల్‌
మహబూబ్‌నగర్‌ నుంచి.... జైపాల్‌ రెడ్డి, డీకే అరుణ, వంశీ చందర్‌ రెడ్డి
నాగర్​కర్నూలు నుంచి.... సంపత్‌ కుమార్‌, సతీష్‌ మాదిగ, మల్లు రవి
వరంగల్‌ నుంచి.... సింగవరపు ఇందిర, మాజీ ఎంపీ రాజయ్య
మహబూబాబాద్‌ నుంచి.... రవీంద్ర నాయక్‌, బలరాం నాయక్‌, రాములు నాయక్‌, బెల్లయ్య నాయక్‌
ఖమ్మం నుంచి.... వి.హనుమంత రావు, రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, వర్దిరాజుల రవిచంద్ర
నల్గొండ నుంచి.... పటేల్‌ రమేష్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పద్మావతి, కుందూరు రఘువీర్‌ రెడ్డి
భువనగిరి నుంచి.... బూడిద భిక్షమయ్యగౌడ్‌, కె.అనిల్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌ రెడ్డి
కరీంనగర్‌ నుంచి.... పొన్నం ప్రభాకర్‌, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయం, పేట రమేష్‌
మెదక్‌ నుంచి.... అనిల్‌ కుమార్‌, నిర్మలా గౌడ్‌
చేవెళ్ల నుంచి.... కొండా విశ్వేశ్వర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌ రెడ్డి
పెద్దపల్లి నుంచి.... వరప్రసాద్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, మోహన్‌
మల్కాజిగిరి నుంచి.... కూన శ్రీశైలం గౌడ్‌, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జంగయ్య యాదవ్‌
సికింద్రాబాద్‌ నుంచిఅంజన్​ కుమార్‌ యాదవ్​తో పాటు మరికొందరు ఉండగా హైదరాబాద్‌ నుంచి అజారుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు లెక్కన ఏఐసీసీకి పంపిన జాబితాలో ఉన్నట్లు హస్తం వర్గాలు వెల్లడించాయి.

undefined

Note: Script Ftp
Last Updated : Mar 2, 2019, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.