పార్టీ వేదికపై చర్చించాల్సిన విషయాలపై లేఖ రాసి... దాన్ని మీడియాకు లీక్ చేయడం బాధాకరమని పీసీసీ మాజీ అధ్యక్షులు లక్ష్మయ్య, శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రేపు అత్యంత కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశం ఉన్న నేపథ్యంలో.. పార్టీ అంతర్గత విషయాలను ఇలా బహిరంగపర్చటం సరైన చర్య కాదని తెలిపారు. గాంధీ కుటుంబం ఈ దేశానికి ఆదర్శంమని... దేశం కోసం జీవితాలను, ప్రాణాలను త్యాగాలు చేసిన కుటుంబమని కొనియాడారు.
దేశ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబం చిరస్థాయిగా నిలిచి ఉందని... వారి నుంచే ఏఐసీసీ అధ్యక్షులు కూడా ఉండాలని కోరారు. పదవుల కోసం ఆశపడే కుటుంబం కాదని... ఇది దేశంలో ప్రతి కార్యకర్త కోరుకుంటున్న విషయమన్నారు. సీనియర్లు కూడా పార్టీ బాగు కోసమే ఆలోచిస్తున్నారని... లేఖల ద్వారా అభిప్రాయాలు తెలియచేయకపోయి ఉంటే బాగుండేదన్నారు. ఒక వేళ లేఖలు రాసినా... దాన్ని బయట పెట్టకుండా ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.