రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోమవారం... తుమ్మిడి హట్టి ప్రాజెక్టును సందర్శించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో హస్తం సీనియర్ నేతలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం జరిపి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అతి తక్కువ ఖర్చుతో కనీసం 120 టీఎంసీల నీటిని తరలించవచ్చని... తద్వారా తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తుమ్మడి హట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నది నీటితో రాష్ట్రంలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని 2008లోనే ప్రణాళిక రూపకల్పన చేసిందన్నారు.
ఇదీ చూడండి : బండి ఎందుకు జరిపావని మూకుమ్మడి దాడి