కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ... నిర్మల్‌లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని వివేక్ చౌక్‌లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసే యత్నంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యకర్తలకు తృటిలో ప్రమాదం తప్పింది.
కరోనాతో అల్లాడుతున్న తెలంగాణకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే నిధులు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణకు ప్రత్యకే ప్యాకేజీ ప్రకటించాలని... లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాందేడపు చిన్నూ, అజార్, జునేద్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: శెభాష్ శిరీషా.. మానవత్వాన్ని చాటారు : హోం మంత్రి కిషన్ రెడ్డి