రాష్ట్రంలో నేడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే... ఎన్‌కౌంటర్లు ఉండవని, నిరుద్యోగ సమస్య ఉండదని ప్రజలు భావించారని ఆయన అన్నారు. కానీ అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సోనియాగాంధీ చేసిన కృషిని కొనియాడారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే రాష్ట్రం ఏర్పడేది కాదని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా సీఎం కేసీఆర్ తమపార్టీలోకి తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు - భవిష్యత్ కార్యాచరణపై జరిగిన సెమినార్‌లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, ప్రజా పక్షం ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'చైనా టీకా 86% సమర్థవంతం'