ETV Bharat / state

'బాలు అస్తమయం... భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు' - Spb sudden demise news

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన లోటు ఎవరూ పూడ్చలేనిదని పేర్కొన్నారు. వేల సంఖ్యలో పాటలు పాడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

'బాలు అస్తమయం... భారతీయ సంగీత రంగానికి తీరని లోటు'

author img

By

Published : Sep 25, 2020, 8:27 PM IST

సంగీత స్వర పుత్రుడు, ఉత్తమ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటని కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం మృతిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మర్రిశశిధర్‌ రెడ్డి, హనుమంతరావు, గూడూరు నారాయణ రెడ్డి, నిరంజన్‌ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర...

ఎస్పీ బాల సుబ్రమణ్యం పలు భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన కంఠం నుంచి జాలువారిన మధురమైన పాటలు ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని పేర్కొన్న ఉత్తమ్‌... బాలు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా, సు’స్వర’ మధురగీతాల రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యలోనే ఉంటారని పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సుస్వరం మూగబోయింది...

గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం అస్తమయం అయ్యారనే వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యావత్ భారతావనికి తన గానామృతంతో మైమరపింపచేసిన బాలసుబ్రమణ్యం మరణ వార్త విషాదకరమన్నారు. ఇకపై ఆయన గొంతు మూగబోతుందన్న చేదు వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతుందని పేర్కొన్నారు. సుస్వరం మూగబోయిందని, బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయకులు, పద్మభూషణ్ బాల సుబ్రమణ్యం అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలిపారు.

ఇదీ చూడండి: ఇలవేల్పుల దివ్యస్తోత్రం.. మూగబోయిన తెరవేల్పుల సుమధుర కంఠం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.