ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

author img

By

Published : May 4, 2020, 11:50 AM IST

Updated : May 4, 2020, 5:55 PM IST

congress leaders met with governar thamilasai in hyderabad
గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

11:45 May 04

గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు గవర్నర్​ను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొవిడ్‌-19 పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తమిళిసైని కలిసిన వారిలో ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఉత్తమ్​ తెలిపారు. తెలంగాణలో ఎందుకు కరోనా టెస్ట్‌లు తగ్గించారని ప్రశ్నించారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు కూడా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం చాలా తక్కువ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ విపక్షాలతో మాట్లాడుతుంటే... తెలంగాణలో సీఎం కేసీఆర్​ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఆరోపించారు.

ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన ఆస్పత్రుల్లో ఎందుకు పరీక్షలు చేయడం లేదన్నారు. చనిపోయిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం, వారికి కరోనా పరీక్ష చేయవద్దని ఆదేశాలివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రశ్నించే మీడియాను బెదిరించడం ఏంటని నిలదీశారు. ప్రతిపక్షం సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1500 రూపాయలు పేదలకు ఇంకా అందలేదని.. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. వలస కార్మికుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పస్టత లేదన్నారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

Last Updated : May 4, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.