ETV Bharat / bharat

బాబా సిద్ధిఖీని చంపింది మేమే - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటన!

బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్​కు​ భద్రత పెంపు - బిష్ణోయ్ గ్యాంగ్​ హిస్ట్ లిస్ట్​లో ఉండడమే కారణం!

Baba Siddique Vs Lawrence Bishnoi
Baba Siddique Vs Lawrence Bishnoi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 2:05 PM IST

Baba Siddique Murder Case Updates : మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే ఇది బిష్ణోయ్ గ్యాంగ్ నిజంగా చేసిందా? లేదా ఏదైనా ఫేక్ న్యూసా అనేది తేలాల్సి ఉంది.

పక్కా ప్లాన్ ప్రకారం!
హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్ధిఖీ నివాసం సహా, ఇతర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు కాల్పులు జరిపిన నిందితులు కర్నైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణలో చెప్పారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని వారు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులకు రూ.50వేలు చొప్పున సుపారీ డబ్బును అడ్వాన్స్‌గా బిష్ణోయ్‌గ్యాంగ్‌ అందించిందని తెలిసింది. హత్యకు కొన్ని రోజుల ముందే ఆయుధాలను పార్శిల్‌లో సరఫరా చేసినట్లు సమాచారం. నిందితులకు మొత్తం రూ.25 లక్షలు ఇవ్వజూపినట్లు తేలింది. ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. 2000-2004 వరకు ఎంహెచ్​డీఏ ఛైర్మన్‌గా ఉన్నపుడు చేపట్టిన స్లమ్‌ రిహాబిలిటేషన్‌ ప్రాజెక్టులో రూ.2వేల కోట్ల స్కామ్​ జరిగినట్లు సమాచారం. ఆ కేసుకు సంబంధించి 2018లో ఈడీ రూ.462 కోట్ల విలువైన సిద్ధిఖీ ఆస్తులను అటాచ్‌ చేసింది. సిద్ధిఖీకి ప్రాణ హాని ఉందని అతడి సన్నిహితులు పేర్కొన్న నేపథ్యంలో 15 రోజుల క్రితమే ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కూడా కల్పించారు. కానీ ఆయన హత్య జరిగిపోయింది. దీనితో బిష్ణోయ్​ గ్యాంగ్ హిట్​ లిస్ట్​లో ఉన్న సల్మాన్‌ఖాన్‌కు ముంబయి పోలీసులు భద్రతను పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్ధిఖీ హత్య దుమారం రేపుతోంది.

సల్మాన్​ఖాన్​కు భద్రత పెంపు
లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సిద్ధిఖీ హత్యలో సంబంధం ఉన్న నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కృష్ణజింకలను వేటాడి బిష్ణోయ్‌ వర్గాన్ని అగౌరవపరిచారన్న కారణంతో సల్మాన్‌ఖాన్‌ను కొంత కాలంగా బిష్ణోయ్​ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసింది. మరోవైపు సిద్ధిఖీకి అనేక మంది బాలీవుడ్‌ తారలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సిద్ధిఖీ ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు, పార్టీలకు సల్మాన్‌, షారుఖ్, సంజయ్‌దత్‌, శిల్పాషెట్టి వంటి అగ్రతారలు తరచూ హాజరవుతుంటారు. గతంలో సల్మాన్‌, షారుఖ్‌ మధ్య తలెత్తిన విబేధాన్ని సిద్ధిఖీ పరిష్కరించినట్లు తెలుస్తోంది. హత్య గురించి తెలియగానే బిగ్‌బాస్‌ 18 షూటింగ్‌ను రద్దు చేసుకున్న సల్మాన్‌ఖాన్‌ నేరుగా సిద్ధిఖీని చేర్పించిన లీలావతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ నటి శిల్పా శెట్టి కంటనీరు పెట్టుకున్నారు.

ఎన్నికల వేళ హత్య?
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సిద్ధిఖీ హత్య తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పతనమయ్యాయని కాంగ్రెస్‌ దుమ్మెత్తిపోస్తోంది. హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. కాగా సిద్ధిఖీ హత్యకు నిరసనగా ఇవాళ పార్టీ కార్యకాలపాలన్నింటినీ రద్దు చేశామని ఎన్సీపీ ప్రకటించింది.

1977లో కాంగ్రెస్‌లో చేరిన బాబా సిద్ధిఖీ 1980 నాటికి బాంద్రా తాలుకాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన మాజీ కాంగ్రెస్‌ నేత, నటుడు సునీల్‌ దత్‌కు అత్యంత సన్నిహితుడు. 1999లో తొలిసారి బాంద్రా వెస్ట్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మూడు సార్లు తన పీఠం నిలబెట్టుకొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.