ప్రగతిభవన్‌లో ఇవాళ ముఖ్యమంత్రి నిర్వహించనున్న దళితబంధు సమీక్షా సమావేశానికి వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. సమావేశంలో... కాంగ్రెస్ పార్టీ తరఫున ఏయే అంశాలను వినిపించాలనేది పార్టీ నేతలతో చర్చించినట్లు తెలిపారు. భట్టి విక్రమార్క నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఇవాళ నిర్వహించనున్న దళితబంధు సమావేశంలో పాల్గొని లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానుందన.. సీఎం దళితబంధు సమీక్షా సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలతో కూడిన సందేశాన్ని సీఎల్పీకి పంపించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు తర్వాత భట్టి నివాసంలో ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: Gazette On KRMB, GRMB: బోర్డుల పరిధిపై కార్యాచరణ వేగవంతం.. ఇంజినీర్ల కేటాయింపు