రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ నేతల భేటీ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు దిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితో పాటు మరో 17 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలపై అందరితో చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు అధ్యక్షుని దృష్టికి తెచ్చినట్లు చెప్పారు.