ETV Bharat / state

మునుగోడుపై ఆశావహులతో కాంగ్రెస్ నేతల భేటీ, అధిష్ఠానానికి నివేదిక - congress meet

congress leaders meet on munugodu by election రాష్ట్రంలో అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిపై ఎంపికలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో మునుగోడు ఆశావాహులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశావాహుల వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకున్నారు.

congress leaders meet on munugodu by election

author img

By

Published : Aug 25, 2022, 4:59 PM IST

congress leaders meet on munugodu by election ఉప ఎన్నికలో టికెట్‌ ఎవరికిచ్చినా సమిష్టిగా పనిచేయాలని రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. వీరితో భేటీ అనంతరం హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కమ్‌ ఠాగూర్‌లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. ఏఐసీసీకి అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రం పీసీసీ నివేదిక పంపనుంది. ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది..

మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తును మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు టికెట్‌ ఆశిస్తున్న నేతలతో వేర్వేరుగా భేటీ నిర్వహించి వారి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకున్నారు. బలాలు, ప్రత్యర్థి పక్షాలను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై వివరాలు సేకరించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సమష్టిగా పని చేయాలని సూచించారు.

మునుగోడు ఆశావహులైన పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, కైలాష్‌ నేత, పల్లె రవికుమార్​తో గాంధీభవన్​లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాజకీయ వ్యుహకర్త సునీల్‌ కనుగోలు ఇప్పటికే ఆశావాహుల బలాబలాలపై పీసీసీకి నివేదిక సమర్పించారు. ఆశావాహులతో సమావేశమైన తర్వాత రెండు మూడు రోజులలో అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాదరణ, పార్టీ విధేయత, ప్రత్యర్థులకు గట్టీ పోటీ ఇవ్వగలిగే అభ్యర్థినే ఎంపిక చేయనున్నారు. నేటి సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

అభ్యర్థి ఖరారుపై విస్తృత చర్చ: మునుగోడు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంది. ఆయనతో పాటు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు భాజపాలోకి వెళ్లారు. ఆ ప్రభావం ఎలా ఉంటుందనే కోణంలో నేతలు చర్చించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే టికెటు కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు..? వారి బలాబలాలపై చర్చించారు. మునుగోడు అభ్యర్థి ఎంపిక హుజురాబాద్ మాదిరి చివరి క్షణంలో కాకూడదని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తి కావాలని నేతలు చర్చించుకున్నారు. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా తెలంగాణలో పాగా వేసేందుకు తెరాస మద్దతుతో ప్రయత్నిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి: ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్‌

బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం నోటీసులు, ఈడీ అధికారాలపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.