Congress Leaders meet Governor Tamilisai : రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ తమిళసైని(Governer Tamilisai) కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతల బృందం రేవంత్‌ను స్పీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు. ఈ సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్, మల్లు రవి తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
కొలువుదీరనున్న కొత్త కేబినెట్ - ఖమ్మం నుంచి మంత్రి పదవి ఎవరికో?
Revanth Reddy Swearing Ceremony : మరోవైపు రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ప్రమాణస్వీకారోత్సానికి ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లు చకచక జరగుతున్నాయి. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉదయం పదిన్నరకు ప్రమాణం చేస్తారని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటా 28 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎం రేవంత్‌కు అఖండ ఆశీస్సులు - మీ మార్క్ పాలనతో తెలంగాణకు శ్రీరామరక్ష
ఎల్బీ స్డేడియంలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవీగుప్తా, ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజనీకుమార్, వసంతకుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకనుగుణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల రాక, పెద్దఎత్తున జనం తరలిరానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
CM Revanthreddy Swearing Ceremony Guests List : గురువారం జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఏఐసీసీ నేతలను ఆహ్వానించడానికి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి స్వయంగా ఆహ్వానించారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మరికొందరు నాయకులను ఆహ్వానించారు. వీరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ కాంగ్రెస్ నేతలు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాష్ట్ర రాజకీయ ప్రముఖులందరిని ఆహ్వానించారు.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు - మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం