Congress Leaders Letter To CS Shanti Kumari : పదిహేను రోజులుగా ప్రజలు వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందించారు. వెంటనే తాము ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలపై చర్చించకపోతే.. పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఈ మేరకు భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, బాధితులను ఆదుకోవాలని సీఎస్ శాంతికుమారిని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఇంత పెద్ద విపత్తు జరిగితే ప్రభుత్వం స్పందించదా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారని.. మళ్లీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు.. వరద బాధితులకు సేవ చేసేందుకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు.
Congress Gave Letter On Floods To CS : కాంగ్రెస్ చేసిన డిమాండ్లను కేబినెట్‌లో గుర్తు చేసి.. ఆమోదించి నిధులు విడుదల చేయాలని సీఎస్ శాంతి కుమారిని కాంగ్రెస్ శ్రేణులు కోరారు. రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ఆ విషయాన్నే మర్చిపోయారని మండిపడ్డారు. వెంటనే రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని నేడు జరిగే కేబినెట్ మీటింగ్‌లో చెప్పాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం తప్పదని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందని.. నియోజకవర్గాలకు మంత్రులు వస్తే ప్రతిపక్షాల నాయకులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
"సిరిసిల్ల జిల్లాలో వరదలకు అంతా పూర్తిగా జలమయం అయిపోయింది. మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఆయన నియోజకవర్గానికి రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రగతిభవన్ నుంచి బయటకు రాలేదు. ఇదిగో నా ప్రభుత్వం ఉంది. మేము అన్ని విధాలుగా ఆదుకుంటామనే ప్రకటన చేయకపోవడం దురదృష్టకరం. ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్‌లో మేము ఏఏ అంశాలను లేవనెత్తామో ఆ అంశాలపై చర్చించాలి. లేకపోతే పోరాటం తప్పదు." - ఎం.కోదండ రెడ్డి, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు
హైదరాబాద్‌లోని చెరువును కబ్జా చేశారు : బీఆర్‌ఎస్ నాయకులు అధికారాన్ని ఉపయోగించుకొని.. హైదరాబాద్‌లోని చెరువులన్నీ కబ్జా చేయడం వల్లే చిన్న వరద వచ్చినా మునిగిపోతుందని ఆరోపించారు. అసలు భాగ్యనగరం ఇలా తయారవడానికి కారణం అధికార పార్టీ నాయకులే అని తీవ్రస్థాయిలో విరమర్శించారు. మహిళలు భయం లేకుండా పని చేస్తారని.. రాష్ట్రాన్ని కాపాడాలని సీఎస్‌ను కోరినట్లు కోదండ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :