ETV Bharat / state

వరద సాయాన్ని ఓటు బ్యాంక్​గా మార్చారు: కాంగ్రెస్ - తెరాసపై మండిపడిన కాంగ్రెస్ నేతలు

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వరద సాయాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్​లో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రెండు రోజుల సమయం ఎలా సరిపోతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు.

congress leaders fire on trs government in hyderabad
వరద సాయాన్ని ఓటు బ్యాంక్​గా మార్చారు: కాంగ్రెస్
author img

By

Published : Oct 24, 2020, 7:26 PM IST

వరద సాయాన్ని తెరాస తన ఓటు బ్యాంకుగా మలుచుకుంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్‌‌కు ఫాంహౌస్​లో చెట్లపై ఉన్న ప్రేమ... వరదల్లో ఉన్న ప్రజలపై, పంట మునిగిన రైతులపై లేదన్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ప్రతినిధుల బృందం సరిగా వ్యవహారించలేదని విమర్శించారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిశీలించడానికి రెండు రోజుల సమయం సరిపోతుందా అని ప్రశ్నించారు. వరద బాధితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు.

మళ్లీ రావాలి

ఏరియల్ సర్వే చేసే సమయం సీఎం కేసీఆర్‌కు లేదా అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న దోపిడీపై కేంద్రబృందానికి లేఖ రాసినట్లు శ్రావణ్‌ తెలిపారు. మరో రెండు సార్లు పరిశీలనకు కేంద్ర బృందం రావాలని కోరుతామన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి రూ.50వేలు, రైతులకు రూ.20వేల చొప్పున పంట నష్టం సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం

భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే భారీ నష్టం జరిగిందని మాజీ ఎంపీ మధుయాస్కీ ఆరోపించారు. వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగినా సీఎం మాత్రం ప్రగతిభవన్ దాటకపోవడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌లో సాయం చేస్తున్నారని. నగరంలో రూ.10వేల సాయం తెరాస కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు యంత్రాంగం ఎలా పనిచేయాలనే దానిపై నిపుణులతో చర్చించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఇది రైతులు, కాంగ్రెస్​ పార్టీ విజయం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.