ETV Bharat / state

Congress leaders angry on KTR comments : కేటీఆర్​పై మండిపడ్డ వీహెచ్​... అలా మాట్లాడటం సబబు కాదంటూ - Telangana latest political news

Congress leaders angry on KTR comments :​ యువసంఘర్షణ సభ నిమిత్తం హైదరాబాద్​కు విచ్చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని.. కేటీఆర్​ టూరిస్ట్‌తో పోల్చడంపై కాంగ్రెస్‌ నాయకులు మండి పడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న సోనియాగాంధీ కుటుంబంపై కేటీఆర్‌ ఆలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

Hanmantharao
Hanmantharao
author img

By

Published : May 9, 2023, 8:26 PM IST

Congress leaders angry on KTR comments : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సొంత పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా సోనియాగాంధీ కుటుంబంపై కేటీఆర్ చేసిన​ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువసంఘర్షణ సభ కోసం హైదరాబాద్​కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని టూరిస్ట్‌తో పోల్చడం.. నగరంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూడాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

నియామాకాల్లో విఫలం.. నీళ్లు, నిధులు, నియామాకాలు లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు.. ఉద్యోగ కల్పనలో బీఆర్​ఎస్​ విఫలమైందన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ ​లీకేజీతో ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్​ అగమ్యగోచరంగా మారిందన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ లేరని.. ఆప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చెన్నారెడ్డి, మదన్ మోహన్​లాంటి నేతల పేర్లు కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని.. కేటీఆర్‌ తన తాహతుకు మించి మాట్లాడుతున్నారని హెచ్చరించారు.

రాష్ట్ర ఏర్పాటుకు సుముఖం.. కేసీఆర్​ ఒక్కరే ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాల వల్ల స్వరాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. అప్పట్లోనే ప్రధాని నెహ్రు, ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్​కావడానికి పార్లమెంట్​లో కాంగ్రెస్​ నేతలందరి సారథ్యం ఉందని గుర్తుచేశారు.

ప్రియాంక గాంధీ హాజరైన సరూర్​నగర్‌ యువసంఘర్షణ సభ విజయవంతం అయిందని.. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. సరూర్​నగర్​ సభలో ప్రకటించిన యువ డిక్లరేషన్‌ను గ్రామగ్రామానికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

"యువ సంఘర్షణ సభ కోసం హైదరాబాద్​కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని టూరిస్ట్‌తో పోల్చడం.. నగరంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూడలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడటం సబబు కాదు. సోనియా గాంధీ కుటుంబం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కేసీఆర్​ ఒక్కరి పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం రాలేదు. ఎందరో అమరవీరులు తమ ప్రాణాలు కోల్పోయారు". - వి.హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు

అలా మాట్లడటం సబబు కాదంటూ​... కేటీఆర్​పై మండిపడ్డ వీహెచ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.