రాష్ట్రంలో సమస్యలపై కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. అందువలనే కేసీఆర్ కూడా చులకన భావంతో ఉన్నారని పేర్కొన్నారు. యురేనియం అంశంపై ఉద్యమానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు యురేనియం తవ్వకాలతో నష్టం జరుగుతుందన్న ఆయన అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ను కూడా కలవాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా .. చెంచులు జీవితాల్లో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో పోలీసులు ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో, ట్రాఫిక్ చాలన్ల పేరుతో జనాల సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: సీఎస్ ఎస్కే జోషికి ఉత్తమ్ వినతిపత్రం