జాతీయ పతాక శతాధిక ఉత్సవాలు నిర్వహించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు లేఖ రాశారు. మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించినట్లుగానే పతాక ఉత్సవాలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ జెండా ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పింగళి వెంకయ్య.. జెండాను రూపకల్పన చేయడం తెలుగు వారికి గర్వకారణమని వీహెచ్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చించి పార్టీపరంగా కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
ఇదీ చదవండి: వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం