దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ... తెలంగాణకు చెందిన యువ నాయకుడు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డిని స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. దేశ రాజధానిలో జరిగే కీలకమైన ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మాజీ ఎంపీ రాజీవ్ సతావ్‌ను కమిటీ ఛైర్మన్‌గా.... సభ్యులుగా రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, హర్యాణాకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి వీరేంద్ర సింగ్ రాథోడ్‌ను నియమించింది.
గతంలోనూ ఇంఛార్జి బాధ్యతలు...
గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో అధిష్ఠానం వంశీచంద్‌కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇంఛార్జిగా నియమించింది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నారు వంశీచంద్‌రెడ్డి.
పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...
దిల్లీకి ఏ మాత్రం సంబంధంలేని వారితో కూడిన ఈ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే స్క్రీనింగ్ కమిటీలో తెలంగాణ కాంగ్రెస్‌కు భాగస్వామ్యం కల్పించడం పార్టీ రాష్ట్ర శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'