హైదరాబాద్ ఎల్బీనగర్లో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదవారికి కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రతిరోజు రెండు వేల ఆహార ప్యాకెట్లను పేదలకు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సైన్మా రెస్టారెంట్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తంగా ఉండాలని వెల్లడించారు. మాస్కులు ధరించటంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు.