ETV Bharat / state

కోనేరుపై కేసు నమోదు చేయాలని హైకోర్టులో పిటిషన్​

అటవీ అధికారి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు సాక్షులను బెదిరించారని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని కాంగ్రెస్​ నేత పాల్వాయి హరీష్​ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేలా ఆసిఫాబాద్​ ఎస్పీని ఆదేశించాలని హరీష్​ ధర్మాసనాన్ని కోరారు.

హైకోర్డు
author img

By

Published : Aug 1, 2019, 11:36 AM IST

అటవీ అధికారిపై దాడి ఘటనలో సాక్షులను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బెదిరించినప్పటికీ... పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 30న అటవీ అధికారి అనితపై ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేశారని.. ఆ కేసులో సాక్షులను కోనప్ప బెదిరించారని హరీష్ పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని జులై 10న కాగజ్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కోనేరుపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేలా కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఎస్పీని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. స్పందించిన హైకోర్టు వారం రోజుల్లో వివరాలు తెలపాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ఇదీ చూడండి : ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

Intro:tg_nlg_213_29_accident_av_TS10117
హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆగి వున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి. వారందరిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి పంపించారు. బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ టైర్ మిగలడంతో ఉదయం నుంచి రోడ్డు మీదే ఆగి వుంది. ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగింది. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.