భాజపాకు సంఖ్యా బలం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. హిందీ భాషపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై అమిత్‌షాకు బహిరంగ లేఖ రాసినట్లు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతాయన్నారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే దేశం- ఒకే పన్ను అంగీకరించామని, కానీ ఒకే దేశం- ఒకే భాష సాధ్యం కాదన్నారు. దీనిపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు.
ఇవీ చూడండి: 'దేశాన్ని ఐక్యం చేసే శక్తి 'హిందీ' సొంతం'