Mahesh Kumar Goud Says Three BRS Ministers Touch With Congress : బీఆర్ఎస్కు సంబంధించిన ముగ్గురు మంత్రులు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ వీడతారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేపారేశారు. అయితే అందుకు సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆరా తీస్తున్నట్లు వివరించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అరోగ్యం గురించి మాణిక్‌రావు ఠాక్రే ఆరా తీశారని తెలిపారు. అదేవిధంగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే నేడు కలసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులు, కాంగ్రెస్ పార్టీలో చేరికలకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లోకి చేరేందుకు మక్కువ చూపుతున్న విషయాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరొకవైపు సోమవారం రాహుల్ గాంధీని కలిసేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతోపాటు పలువురు నాయకులు దిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్యనాయకులను దిల్లీకి రావాలని పిలిచినట్లు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.
Other Party Leaders Joining In Congress Party In Telangana : వారు పార్టీలో చేరడం వల్ల ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పీసీసీతోపాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, ఏఐసీసీ నాయకులు ప్రత్యేకంగా సమావేశమై.. ఆ రెండు జిల్లాల్లో పార్టీ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
Congress Party In Telangana : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి అధిక సంఖ్యలో చేరికలు ఉంటున్నాయని.. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అలాగే మరో ఐదుగురు బీఆర్ఎస్ జడ్పీఛైర్మన్లు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనే వార్తలు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే ఖమ్మంలో రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేసి కనీసం 20 మందిని పార్టీలో చేర్పించుకునేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి :