కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మాట్లాడారు.
సాగర్ ఉప ఎన్నికలోనూ అధిష్ఠానం నిర్ణయం మేరకే తాను పోటీ చేశానని జానారెడ్డి వివరణ ఇచ్చారు. ఇప్పటికే తనకు 75 సంవత్సరాలు వయస్సు ఉందని.. ఇంకా తనకు రాజకీయాల్లో ఉండి పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. పరిస్థితుల ప్రభావం వల్ల పార్టీ నిర్ణయం తీసుకొని పోటీ చేయమని కోరినా.. తాను చేయలేనని చెబుతానని చెప్పారు.