తెరాస హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌లు ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి సేవలు అందిస్తున్న వారిని డివిజన్ల అధ్యక్షులుగా నియమిస్తూ.. పలువురికి నియామక పత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన... చిన్న చిన్న విబేధాలు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధిని తెలియజేసి ఓట్లు పొందాలని పేర్కొన్నారు. తెరాస పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు, మంచినీటి బిల్లులు తెరాస వచ్చిన తర్వాతనే పెరిగాయని... వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్‌లో పెట్టుకుంటే బాగుంటుంది'