బడ్జెట్‌పై కాంగ్రెస్ కిసాన్‌సెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీస మద్దతు ధర కోసం రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నా ఆ అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదని కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ తరహాలో పసుపును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కోదండరెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంతంటే!