ETV Bharat / state

బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్ - telangana municipal elections updates

పురపోరులో సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్.. కసరత్తు పూర్తి చేసింది. పార్టీకి విధేయులు, ఫిరాయింపులు చేయని వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ పెద్దలు.. ఇవాళ్టి నుంచి బీ-ఫార్మ్​ల పంపిణి ప్రారంభించారు.

congress issued bforms to their candidates
బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్
author img

By

Published : Jan 10, 2020, 11:37 PM IST

కాంగ్రెస్​ బీ ఫారాల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బీ ఫారాలు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ ​రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అందజేశారు. పంపిణి కార్యక్రమం రేపు సాయంత్రం లోపు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌కు ఉత్తమ్​ సూచించారు.

రేపు సాయంత్రం లోపు నామినేషన్ల పరిశీలన పూర్తి కానుండడంతో అప్పటికల్లా... బీఫారాలు డీసీసీలకు చేరినట్లయితే ఎల్లుండి బీఫారాలను ఆయా మున్సిపాలిటీల, నగరపాలక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందచేస్తారు.

బీ-ఫారా​ల పంపిణీ ప్రారంభించిన కాంగ్రెస్

ఇవీచూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

TG_hyd_88_10_CONG_BFORMS_ISSUED_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: గాంధీభవన్‌ నుంచి ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు ()తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరఫున మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులకు అందచేసేందుకు భీపార్మ్‌ల పంపిణీ కార్యక్రమం ఈ సాయంత్రం ప్రారంభమైంది. గాందీ భవన్‌లో సంగారెడ్డి జిల్లాకు చెందిన భీఫార్మ్‌లను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసరాజు, శ్రీనివాసకృష్ణన్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌లు ఆ జిల్లా ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అందచేశారు. ఇవాళ సాయంత్రం ప్రారంభమైన ఈ బీఫార్మ్‌ల పంపిణీ కార్యక్రమం రేపు సాయంత్రం లోపు పూర్తి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌కు సూచించారు. ఇప్పటికే సంతకాలు చేసి జిల్లాల వారీగా సిద్దం చేసిన బీ ఫార్మ్‌లను ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు చేరవేసే కార్యక్రమం చేపట్టినట్లు ఉత్తమ్‌ తెలిపారు. జిల్లాల నుంచి డీసీసీ అధ్యక్షులు వచ్చి తీసుకెళ్లడంకాని, వారి తరఫున ఓ ప్రతినిధిని గాంధీభవన్‌కు పంపించి కాని బీఫార్మ్‌లను అన్ని జిల్లాలకు చేరవేసే కార్యక్రమం పీసీసీ ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌కు అప్పగించారు. రేపు సాయంత్రం లోపు నామినేషన్ల పరిశీలన పూర్తి కానుండడంతో అప్పటికల్లా...బీఫార్మ్‌లు డీసీసీలకు చేరినట్లయితే ఎల్లుండి బీఫారాలను ఆయా మున్సిపాలిటీల, నగరపాలక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందచేస్తారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.