ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటం వల్ల ఆశలు చిగురించిన వలస కార్మికుల్లో ఆర్థిక మంత్రి మాటలు నిరాశ పరిచాయని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఆరోపించారు. నిర్మల సీతారామన్ మాట్లాడిన తరువాత వలసకార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయారని పేర్కొన్నారు.
వలస కార్మికుల పట్ల కేంద్రం ఘోరంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వలస కార్మికుల విషయంలో గాయం ఒక చోట ఉంటే మందు మరోచోట రాస్తోందని ఎద్దేవా చేశారు. వారి కోసం ప్రకటించిన 11వేల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు.