ETV Bharat / state

ఎన్నికలు వస్తేనే లిఫ్ట్​లు గుర్తుకొచ్చాయా? : రాములు నాయక్​ - నల్గొండ సభలో సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ రాములు నాయక్

సీఎం కేసీఆర్​ అబద్ధాలతో సాగర్​ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ఆరోపించారు. ఏడేళ్లలో లేని లిఫ్ట్​లు ఇప్పుడే గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్​ హయాంలోనే ఎక్కువ లిఫ్ట్​లు ఏర్పాటు చేశామన్నారు.

congress ex mlc  ramulu nayak fire  on cm kcr on nalgonda sabha cm comments
ఎన్నికలు వస్తేనే లిఫ్ట్​లు గుర్తుకొచ్చాయా? : రాములు నాయక్​
author img

By

Published : Feb 11, 2021, 7:09 PM IST

నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలు వస్తున్నాయనే లిఫ్ట్​ ఇరిగేషన్ గురించి సీఎం మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులపై అబద్ధాలు ప్రచారం చేస్తూ మరోసారి నల్గొండ, నాగార్జున సాగర్ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలోనే జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించామని తెలిపారు.

ఏడేళ్లలో గుర్తుకు రాని లిఫ్ట్​ ఇరిగేషన్లు ఇప్పుడే గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. గిరిజనుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. వైస్​ రాజశేఖర్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల పట్టాలిచ్చామన్నారు.

గిరిజనులు సమస్యల గురించి మాట్లాడితే ప్రజలను కుక్కలని సీఎం కేసీఆర్ సంభోధించడం సరికాదన్నారు. నాగార్జునసాగర్​లో ఎన్ని జిమ్మిక్కులు చేసిన కాంగ్రెస్​దే గెలుపని రాములు నాయక్​ జోస్యం చెప్పారు.

ఇదీ చూడండి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.