ETV Bharat / state

Congress Door to Door Campaign in Telangana : జోరుగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.. ఆరు హామీలను వందరోజుల్లో అమలుచేస్తామని హామీ - Congress Door to Door Campaign in Telangana

Congress Door to Door Campaign in Telangana : రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు.. 6 గ్యారంటీలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.

Congress 6 Guarantee Schemes
Congress Door to Door Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 10:17 PM IST

Congress Door to Door Campaign : జోరుగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.. పథకాలను వందరోజుల్లో అమలుచేస్తామని హామీ

Congress Door to Door Campaign in Telangana : తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభ(Congress VijayaBheri)లో కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారంటీ(Congress Six guarantee Schemes)లను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ చేరుకోగా.. ఆ సభ అనంతరం ఆదివారం రాత్రి వారంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'

అధిష్ఠానం కేటాయించిన ప్రాంతాలకు వెళ్లిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇతర నాయకులు.. రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం నుంచి స్థానిక నాయకులతో కలిసి గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. ఇంటింటికి వెళ్లి, ఆరు గ్యారంటీల ప్రకటన, అమలు గురించి వివరించారు. మల్కాజిగిరిలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు అళగిరి.. గడపగడపకు తిరుగుతూ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు.

Congress 6 Guarantee Schemes in Telangana : హైదరాబాద్‌ కింగ్ కోఠీలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత ఏక్​నాథ్ గైక్వాడ్‌, హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్‌మున్షి పర్యటిస్తూ.. కర్ణాటక తరహాలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అన్నారు.

హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్‌ వరకు ఇంటింటికి ఆరు గ్యారెంటీలు పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ నేత ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి, నాంపల్లి యూసుఫ్‌ బాబా దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన పైలెట్‌.. ఇంటింటికి వెళ్లి, కాంగ్రెస్‌ అమలుచేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు.

CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా

Congress Leaders to go Door to Door Campaign in Telangana : హనుమకొండలో సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్‌ ఖుర్షీద్‌, ఛండీగఢ్‌ పీసీసీ అధ్యక్షుడు హర్‌మోహిందర్‌ సింగ్‌ లక్కీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి పర్యటించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ నేత అవినాష్ పాండే, వీహెచ్.. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి తెలియజెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహబూబాబాద్‌లో అసోం పీసీసీ అధ్యక్షుడు భూపెన్ కుమార్, సత్తుపల్లి నియోజకవర్గంలో ఆరీఫ్ నసీం ఖాన్ పర్యటిస్తూ.. 6 గ్యారంటీలను వివరించారు.

"రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి రాగానే అమలుచేస్తాం". - అమరేందర్ సింగ్, పంజాబ్ పీసీసీ

Congress Vijayabheri Sabha Success : నల్గొండ జిల్లా హాలియాలో కుందూరి జైవీర్‌ రెడ్డితో కలిసి అరుణాచల్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబంటుకీ పర్యటించారు. నల్గొండలో పర్యటించిన సీడబ్ల్యూసీ సభ్యుడు లాల్‌ జీ దేశాయ్.. కేసీఆర్, మోదీ పాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్‌ సింగ్‌ రాజా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో సీడబ్ల్యూసీ సభ్యులు దేవేందర్ యాదవ్ ప్రచారం చేశారు. ఆరు గ్యారెంటీలను ఇంటింటికి ప్రచారం చేస్తున్న వేళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌లో 2 వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్‌ ప్రకాశ్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా.. పొన్నం, ప్రవీణ్‌ వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొని, పరస్పరం దాడులు చేసుకున్నారు.

Revanth Reddy Counter to BRS Leaders : 'కేసీఆర్‌ సర్కారుకు ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయి.. బీఆర్​ఎస్​ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.