ETV Bharat / state

'నాగార్జున సాగర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ నిలిపివేయండి'

author img

By

Published : Apr 29, 2021, 1:11 PM IST

నాగార్జున సాగర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కాంగ్రెస్ లేఖ రాసింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

congress
congress

రాష్ట్రంలో రేపు మినీ పురపాలక ఎన్నికలు ఉండడం వల్ల నాగార్జున సాగర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కాంగ్రెస్ లేఖ రాసింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడకుండా చర్యలు తీసుకోవాలని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి. నిరంజన్‌ విజ్ఞప్తి చేశారు. సాగర్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వెల్లడించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం అనుమతించడం సహేతుకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది ఎన్నికల నియమావళికి, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథికి… రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. రేపు రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా… మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.