రెండు పడక గదుల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఇళ్ల కోసం పేదల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, మంజూరు చేసిన ఇళ్లు ఎన్ని, నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఎన్ని, ఎప్పటి లోపల లబ్దిదారులకు ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 2,80,616 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదించిందని, అందులో ఐదు శాతం కూడా నిర్మించలేదన్నారు. అందులో మళ్లీ 1 శాతం ఇళ్లు కూడా లబ్దిదారులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మాణాలు పూర్తయ్యాయని చెబుతున్నా ఇళ్ల సంఖ్యపై క్యాబినెట్ మంత్రి, నగర మేయర్‌లు భిన్నమైన ప్రకటనలు చేశారన్నారు. తెరాస నేతలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా ఇస్తున్నట్లు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!