ETV Bharat / state

'క్షేత్ర స్థాయి నుంచి పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి'

author img

By

Published : Nov 5, 2019, 9:05 PM IST

గాంధీభవన్‌లో ఇవాళ పీసీసీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. హెచ్.కె.పాటిల్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీనియర్​ నేతలు హాజరై పలు అంశాలపై చర్చించారు.

గాంధీభవన్​లో పీసీసీ కోర్​ కమిటీ సమావేశం

గాంధీభవన్​లో ఇవాళ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్​.కె.పాటిల్ అధ్యక్షతన ఈ సాయంత్రం దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది.ఈనెల 15వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నిర్వహించాల్సిన ఆందోళనలపై పాటిల్‌ రాష్ట్ర నేతలతో చర్చించారు. అధిష్ఠానం పిలుపునిస్తున్న కార్యక్రమాలు అయినందున తీవ్రంగా పరిగణించాలని పాటిల్ నేతలకు సూచించారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించాలని... 8వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేసేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షులు లేని జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పీసీసీ కార్యవర్గ సభ్యులకు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను, కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పాటిల్‌ పార్టీ నేతలకు సూచించారు.

'కేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి'

ఇవీ చూడండి: గులాంనబీ ఆజాద్​ ఎదుటే కాంగ్రెస్​ సీనియర్ల రగడ

TG_Hyd_58_05_Cong_Core_Committe_Meeting_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీన తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి 16న హైదరాబాద్ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, బలరామ్ నాయక్, పలువురు సినీయర్ నేతలు హాజరయ్యారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.