Congress Complaints EC on KTR : దీక్షా దివస్‌కు పిలుపునిచ్చి మంత్రి కేటీఆర్(KTR) ఎలక్షన్కోడ్ నియమాలను ఉల్లఘించారని.. కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్(Congress Party) పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్.. జి నిరంజన్ తెలంగాణ సీఈఓకి ఫిర్యాదు చేశారు. నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్ష దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌పై ఈసీ స్క్వాడ్ అభ్యంతరం
Telangana Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసిందని.. 144 సెక్షన్ అమలులో ఉన్నా, మీడియాపై ఆంక్షలు ఉన్నా దీక్షా దివస్ కార్యక్రమాలు చెయ్యడం ఓటర్లను ప్రభావితం చెయ్యడమే అవుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మంత్రి కేటీఆర్‌పై.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
Congress Latest News : రేపు జరగబోయే పోలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఓటర్లను.. ఆంధ్రా సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులు ఆపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఈసీకి తెలిపారు. ఇక్కడున్న బీఆర్ఎస్కు మద్దతుగా.. ఏపీ పోలీసులు పనిచేస్తున్నారని అందుకే ఓటర్లను ఆపుతున్నారని భావిస్తున్నామన్నారు. సరిహద్దుల్లో పోలీసులు ఓటర్లను ఆపవద్దని సీఈవోను కోరినట్లు తెలిపారు.
కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు - నివేదిక కోరిన సీఈసీ - కేసు నమోదు చేసిన కమలాపూర్ పోలీసులు
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బీఆర్ఎస్ మంత్రులు, నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచి ఓట్లు వేయించుకునేలా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈసీ ఉందా.. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అన్న సంశయం ప్రజల్లో ఏర్పడిందని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ జి. నిరంజన్ పేర్కొన్నారు.
పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీసులు చూస్తారా ? అన్న అనుమానం నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. అంబర్ పేటలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని.. ఇలాగే కొనసాగి రేపు ఏమైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అసలేం జరిగందంటే.. రాష్ట్ర స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం నవంబరు 29న దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతం అవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని చెప్పారు. నవంబరు 29న దీక్షా దివస్ సందర్భంగా.. రక్తదానాలు చేయాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
కోతుల బెడద అరికట్టే వారికే మా ఓటు - ఫ్లెక్సీలతో వినూత్న నిరసన