ముఖ్యమంత్రిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను పీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ కలిశారు. ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని.. మాజీ మంత్రి సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో రాజకీయ అంశాలు చర్చించారని ఆరోపించారు. అధికారిక నివాసంలో రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించడం ముమ్మాటికీ ఉల్లంఘనేనని.. ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇవీ చూడండి: కాంగ్రెస్‌కి మరో షాక్...కారెక్కుతున్న సుధీర్‌రెడ్డి