కుత్బుల్లాపూర్ 125వ డివిజన్ గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు గాజులరామారం సర్కిల్ కార్యాలయానికి తరలిరావడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థికి ముగ్గురు సంతానం ఉన్నారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారులు అన్యాయంగా శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ తిరస్కరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.