ETV Bharat / state

Congress Bus Yatra Ended in Telangana : ముగిసిన కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. ప్రజల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్న రాహుల్‌ గాంధీ

Congress Bus Yatra Ended in Telangana : తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన సంపదంతా.. ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అదంతా ప్రజలకు పంచుతామని తెలిపారు. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు సాగిన కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. ఆర్మూర్‌ సభతో ముగిసింది. చివరి రోజు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన రాహుల్‌.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ప్రజల తెలంగాణ ఏర్పాటే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

rahul gandhi tour in telangana
Congress Bus Yatra Ended in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 7:52 PM IST

Congress Bus Yatra Ended in Telangana ముగిసిన కాంగ్రెస్‌ బస్సు యాత్ర ప్రజల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్న రాహుల్‌ గాంధీ

Congress Bus Yatra Ended in Telangana : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌.. విజయభేరీ పేరుతో తొలి విడతలో మూడ్రోజుల పాటు చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. రామప్ప ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో సాగింది. ఉదయం కరీంనగర్‌ నుంచి బయలుదేరిన రాహుల్‌.. నేరుగా జగిత్యాలకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించిన రాహుల్‌.. తెలంగాణ సంపదంతా కేసీఆర్‌ కుటుంబం పాలైందని ఆరోపించారు. గాండ్రిస్తున్న కాంగ్రెస్‌ పులులు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను పెకిలించి వేయనున్నట్లు చెప్పారు.

Rahul Gandhi Speech at Mortad : 'రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయింది.. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారు'

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఒక కుటుంబం పాలైంది. రాష్ట్ర ఆదాయం, భూములు, ఇసుక, మద్యం.. ఇలా పూర్తి సంపదంతా ఒక కుటుంబం నియంత్రణలో కొనసాగుతోంది. మా ప్రభుత్వం వచ్చాక ఇక్కడి చక్కెర కర్మాగారాన్ని మళ్లీ తెరిపిస్తాం. మేము ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుంది. తెలంగాణలో ప్రజల తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. - రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

జగిత్యాలలో సమావేశం అనంతరం కోరుట్లకు బయలుదేరిన రాహుల్ అక్కడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న భోజనం అనంతరం నిజామాబాద్‌ జిల్లాలోకి కాంగ్రెస్‌ బస్సు యాత్ర ప్రవేశించగా.. మోర్తాడ్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీని ప్రశ్నించే విపక్ష నేతలందరినీ వెంటాడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు.. అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రం పట్టించుకోవని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నాయన్న ఆయన.. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటేసినా ఒకరికే వెళ్తుందన్నారు.

Rahul Gandhi Speech at Mulugu Congress Public Meeting : 'దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి'

ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలు బరిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీతో కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. బీజేపీ 24 గంటలూ నాపై దాడి చేస్తోంది. మీ ముఖ్యమంత్రి దర్జాగా అవినీతి చేశారు. కానీ ఆయనపై సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ విచారణ జరగలేదు. బీజేపీ.. బీఆర్‌ఎస్‌ను రక్షిస్తుంది. మూడు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటాయి. - రాహుల్‌ గాంధీ

కేసీఆర్ దోపిడీ అంతా కక్కిస్తాం..: బస్సు యాత్రలో చివరగా ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. సోనియాగాంధీ ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు చేయలేదన్న రాహుల్‌.. కేసీఆర్‌ కుటుంబం చేసిన దోపిడినంతా ప్రజలకు పంచుతామని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలను వివరిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సోనియా సంపూర్ణ మద్దతు లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదని ఆయన అన్నారు. సోనియాగాంధీ దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ కావాలనుకున్నారన్నారు. గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రజల సంపదను దోపిడీ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఎంత దోపిడీ చేశారో అంతా ప్రజలకు తిరిగి ఇస్తామని వెల్లడించారు.

Rahul Gandhi Khammam Meeting Speech : 'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం'

6 గ్యారంటీల అమలు గ్యారంటీ..: ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునామీ రాబోతోందన్న రాహుల్‌ గాంధీ.. క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ సాకారమవుతుందన్న ఆయన.. అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని తెలిపారు. మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.2,500 వేస్తామన్నారు. సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని.. తమ ప్రభుత్వం రాగానే టికెట్‌ లేకుండా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామన్నారు. పసుపు క్వింటాల్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని.. అన్ని పంటలకు మద్దతు ధరకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • This election is a fight between ‘Dorala’ Telangana and ‘Prajala’ Telangana.

    Congress' 6 Guarantees will provide support to every family of Telangana.

    ✅ Mahalakshmi
    - ₹2,500/month to women
    - Free bus travel
    - Gas cylinder for ₹500

    ✅ Indiramma Indlu
    - ₹5 lakh assistance to… pic.twitter.com/k2GdhQuMiW

    — Rahul Gandhi (@RahulGandhi) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Political Josh in Telangana Congress Party Leaders : కాంగ్రెస్​ నేతల్లో ఫుల్​ జోష్​.. 90 సీట్లు గ్యారెంటీ అన్న కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ గూటికి రేఖా నాయక్‌..: ఇదిలా ఉండగా.. ఆర్మూర్ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్‌లు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మూడో రోజు కరీంనగర్‌లో ప్రారంభమైన బస్సు యాత్ర కొండగట్టు, గంగాధరతో పాటు నిజామాబాద్ జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా.. దిల్లీలో రాహుల్‌ గాంధీ కార్యక్రమాల దృష్ట్యా షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ కారణంగా కార్నర్‌ మీటింగ్‌ల నుంచి ఆర్మూర్‌ సభకు హాజరైన రాహుల్‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి బయల్దేరి, అక్కడి నుంచి దిల్లీకి పయనమయ్యారు.

Rahul Gandhi Speech at Jagtial : 'ఓబీసీలకు అండగా నిలిచేందుకు కేసీఆర్‌ సిద్ధంగా లేరు.. అధికారంలోకి రాగానే కులగణన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.