ETV Bharat / state

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...? - తెలంగాణ ఎన్నికలు

Congress BRS Raise Political Heat in Telangana : శాసనసభ ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అనుబంధ విభాగాలను సైతం పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి ఆయా విభాగాలను సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో వరసగా పార్టీ అగ్రనేతల పర్యటనలు ఉండేట్లు పీసీసీ షెడ్యూల్‌ సిద్దం చేస్తోంది. ఈ నెల 18వ తేదీవ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రానికి వస్తుండగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దళిత, గిరిజన డిక్లరేషన్‌లతోపాటు బీసీ మహిళ డిక్లరేషన్లను కూడా ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

Political Heat in Telangana
Congress BRS Raise Political Heat in Telangana
author img

By

Published : Aug 12, 2023, 3:29 PM IST

Congress BRS Raise Political Heat in Telangana : తెలంగాణాలో రోజు రోజుకు రాకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌(Indian National Congress) అధికారంలోకి వచ్చే అవకాశం మెరుగ్గా ఉండడంతో.. నాయకులంతా కలిసికట్టుగా పని చేసి, ఏకతాటిపై ఉన్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలను పంపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు(Telangana General Election). శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో పీసీసీ నిమగ్నమైంది.

ఇటీవల గజ్వేల్‌లో యువజన కాంగ్రెస్‌ నిర్వహించిన నిరుద్యోగ గర్జనలో ఆల్​ఇండియా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో మహిళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజ, రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ ఆమ్ స్ట్రాంగ్ ఫెర్నాండోలు పాల్గొని రాష్ట్ర విభాగాలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సుపాల్ సింగ్ ఖైరా ఇటీవల హైదరాబాద్‌ వచ్చి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధులతో భేటీ అయ్యారు.

కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను చూపిస్తూ ప్రజల్లోకి: రైతుల వ్యవసాయంపై కేంద్ర, రాష్ట్ర (State And Central Failures in Telangana) ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షతపై పోరాటం చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి ఖైరా సూచించారు. ఎస్సీసెల్ కార్యనిర్వాహక సమావేశానికి ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ రాజేష్ హాజరుకాగా.. ఆగస్టు 5వ తేదీన గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలకు నియమితులైన పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ నెల 13వ తేదీన ఎస్టీ సెల్ సమావేశానికి జాతీయ ఆదివాసీ సెల్ ఛైర్మన్ శివాజీరావ్ మోగే హాజరుకానున్నారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ఈ సభల ద్వారా దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది. ఈ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై పీసీసీ యోచిస్తోంది.

Congress Plans to Win in TS Assembly Elections : వ్యూహాత్మకంగా ముందుకెళ్లుతున్న ఏఐసీసీ.. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను, ఛైర్మన్లను రాష్ట్ర పర్యటనకు పంపి, ఆయా విభాగాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేసేట్లు చూస్తోంది. ఇందువల్ల ఆయా వర్గాలు పార్టీ దగ్గర అవుతాయని, క్షేత్రస్థాయిలో ఆయా విభాగాలు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చురుకైన పాత్ర పోషిస్తాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్​ ప్రకటించే అవకాశం: ప్రధానంగా ఎన్‌ఎస్‌యుఐ, యువజన, ఎస్సీ, ఎస్టీ, మహిళ విభాగాల ముఖ్య నేతలను రంగంలోకి దింపి వారికి లక్ష్యాలను నిర్దేశించన్నారు. అంతేకాకుండా ఈనెలాఖరులో రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ సభలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సభ పెట్టలనుకున్నప్పటికీ.. వాతావరణ ప్రతికూల పరిస్ధితులతో కుదరలేదు. దీంతో ఈ నెల చివరలో సభ ఏర్పాటు చేసి, ప్రియాంక గాంధీని తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్‌ భావిస్తోంది. అదేవిధంగా త్వరలో రాహుల్​గాంధీతో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడేప్పటికీ. చిట్టచివర ఒకట్రెండు సభలకు సోనియాగాంధీ కూడా పాల్గొనున్నారు.

అధికారంలోకి వస్తే ఏం చేస్తాం: కాంగ్రెస్‌ పార్టీ వస్తే రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తుందో సందేశం ఇప్పించాలని యోచిస్తున్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన.. మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చినందున.. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా ఆమె ఏ విషయం చెప్పినా.. అది అమలు జరగడం ఖాయమన్న విశ్వాసాన్ని ప్రజల్లో నింపాలని పీసీసీ యోచిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజక వర్గాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ వారి ద్వారా పార్టీలో ఐఖ్యతను తీసుకొచ్చే దిశలో ముందుకెళ్లుతోంది.

నియోజకవర్గాల వారీగా నాయకులతో చర్చించి, సమన్వయం చేసుకునేట్లు చూస్తున్నారు. ఇటు పార్టీ అనుబంధ విభాగాలతోపాటు ఏఐసీసీ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ వేస్తున్న ఎత్తులు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాలి.

Congress Telangana Elections : బీఆర్ఎస్​ను ఎదుర్కొనేలా కాంగ్రెస్ పక్కాప్లాన్.. 'వార్ రూమ్​'గా ఇందిరా భవన్

Telangana Assembly Elections 2023 : అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ అడుగులు.. ప్రచార సైన్యాన్ని ప్రకటించిన ఏఐసీసీ

Congress Kollapur Meeting : ఖమ్మం జనగర్జనకు దీటుగా.. కొల్లాపూర్​లో కాంగ్రెస్‌ బహిరంగసభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.