ETV Bharat / state

16న కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థుల ప్రకటన? - congress

లోక్​సభ ఎన్నికలకు ప్రకటన రావటంతో రాష్ట్రంలోని  ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోన్నాయి. కాంగ్రెస్​ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి... జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపింది. మంగళవారం సమావేశమైన స్క్రీనింగ్​ కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. ఈ నెల 16 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

కుంతియా
author img

By

Published : Mar 13, 2019, 6:22 AM IST

Updated : Mar 13, 2019, 8:40 AM IST

16న కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థుల ప్రకటన?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఇంఛార్జీకార్యదర్శులు బోస్​రాజు, సలీం అహ్మద్​, శ్రీనివాసన్​ కృష్ణ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టి హాజరయ్యారు. భేటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం రాగా మిగతా స్థానాల్లో రెండేసి పేర్లు పరిశీలిస్తున్నారు. తెరాసలో సీటు దక్కని ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్​లోకివస్తారని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

మరో అవకాశం?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ సీటు ఇవ్వాలా వద్దా అనే అంశాంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్​, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్​, సురేశ్​ షెట్కార్​, రమేశ్​​ రాఠోడ్​, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పోటీ చేయగా రాజగోపాల్​ రెడ్డి ఒక్కరే గెలుపొందారు.పొన్నం ప్రభాకర్​, రమేశ్​ రాఠోడ్​లు బలమైన అభ్యర్థులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

16న ప్రకటన

నేతల బలాలు, బలహీనతలపై చర్చించామని కుంతియా తెలిపారు. ఈ నెల 16న జాబితాకు తుదిరూపు ఇచ్చి కాంగ్రెస్​ ఎన్నికల కమిటీకి అందజేస్తామన్నారు. అదే రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్నారు. తెరాస నుంచి ఇంతవరకు ఎవరూ కాంగ్రెస్​ అధిష్ఠానాన్ని సంప్రందించలేదని తెలిపారు.

ఇవీ చూడండి:హస్తంతో సబిత దోస్తీ వీడనుందా...?

Intro:FILENAME:TG_KRN_31_11_MLC_JEEVANREDDY_PRACHARAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ తెలంగాణ ఏర్పడితే నీళ్ళు నిధులు నియామకాలు వస్తాయని ఓట్లు వేసిన ప్రజలకు కు తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైందని శాసనమండలిలో ప్రశ్నించే గొంతు లేకపోతే తెరాస ప్రభుత్వం ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి కి ఓటు వేస్తే శాసనమండలిలో ప్రశ్నించి ఉద్యోగుల భద్రతకు విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు లభిస్తుందని ప్రైవేటు రంగంలో ఉపాధి పొందుతున్న బోధన సిబ్బంది మరియు u.p. పాలన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాలకు చెందిన శాసన మండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని

Body:టటట

Conclusion:
Last Updated : Mar 13, 2019, 8:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.