ప్రశాంతంగా బంద్ చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క . ముఖ్యమంత్రి ప్రజలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వెంకట్‌ను పోలీసులు కొట్టడాన్ని ఖండించారు. ఆర్టీసీ ఉద్యమంలో ఇద్దరు కార్మికులు చనిపోయినా.. సీఎంలో చలనం లేదని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొని అరెస్టైన వీరు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు.
ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్