ETV Bharat / state

Medical Admissions: 'ఇదెక్కడి గందరగోళం.. నచ్చని వాటిల్లోనూ చేరాల్సి వస్తోంది'

Medical Admissions: వైద్యవిద్య ప్రవేశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే దఫా ఐచ్ఛికాల నమోదు ప్రక్రియతో.. నచ్చని వాటిల్లోనూ చేరాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కళాశాలలో చేరాలో? దేనిలో వద్దో? అనే సంకట స్థితి విద్యార్థుల్లోనే కాకుండా వారి తల్లిదండ్రుల్లోనూ నెలకొంది.

Medical Admissions
వైద్యవిద్య ప్రవేశాలు
author img

By

Published : Feb 10, 2022, 8:50 AM IST

Medical Admissions in Telangana: వైద్యవిద్య కన్వీనర్‌ కోటా తొలివిడత ప్రవేశ ఫలితాల్లో ఒక విద్యార్థికి సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. వాస్తవానికి ఆ విద్యార్థికి ఆ కళాశాలలో చేరాలనే ఉద్దేశం లేదు. కానీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా.. అనివార్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కలుపుకొని మొత్తం 29 కళాశాలలకు ప్రాధాన్య క్రమంలో ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలి. దీంతో ఆ విద్యార్థి కోరుకున్న కళాశాలలో కాకుండా.. ర్యాంకుల ప్రకారంగా ఈ సీటొచ్చింది. ఇప్పుడు ఆ కళాశాలలో చేరకపోతే రెండోవిడత కౌన్సెలింగ్‌లో ఆ విద్యార్థిని పరిగణనలోకి తీసుకోరు. ఒకవేళ చేరితే.. రెండోవిడతలో అసలు వస్తుందో.. రాదో తెలియని స్థితి. ఈ కళాశాలలో చేరడం కంటే.. యాజమాన్య కోటాలో మరో నచ్చిన కళాశాలలో చేరడం మేలని ఆ విద్యార్థి, తల్లిదండ్రుల భావన. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కళాశాలలో చేరాలా? వద్దా? అనే సంకట స్థితి నెలకొంది. ఈ దఫా దాదాపు అత్యధిక మంది విద్యార్థుల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. పైగా ఒకే దఫా ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇవ్వడంతో.. రెండోవిడతకు మళ్లీ దరఖాస్తు చేసుకునే పరిస్థితుల్లేవు. ఒకేసారి అన్ని కళాశాలలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ఉత్తర్వులతో చిక్కులు

గతేడాది కన్వీనర్‌ కోటా వైద్యవిద్య సీట్ల భర్తీ ప్రక్రియలో విద్యార్థులకు కళాశాలలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేది. ప్రాధాన్య క్రమంలో తనకు నచ్చిన ఆరో, ఏడో కళాశాలలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకునేవారు. వాటిలోని ఏ కళాశాలలో సీటు వచ్చినా చేరాల్సిందే. చేరకపోతే తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హత లభించదు. విద్యార్థి ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఐచ్ఛికాలే కాబట్టి సమస్యలేదు. పైగా గతేడాది ఏ విడత కౌన్సెలింగ్‌కు ఆ విడతనే విద్యార్థులు తాజాగా ఐచ్ఛికాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉండేది. దీంతో తనకొచ్చిన ర్యాంకు.. అప్పటి వరకూ ఏ కళాశాలలో సీటు లభించిందనే అంశం.. ఇంకా తదుపరి విడతలో ఏయే కళాశాలల్లో వచ్చే అవకాశాలున్నాయి? తదితర కోణాల్లో ఆలోచించి అప్పటికప్పుడు ప్రాధాన్యక్రమాలను మార్చుకునేవారు. ఈ ఏడాది నుంచి పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. అన్ని కళాశాలలకు ఒకేదఫా మాత్రమే ఐచ్ఛికాల ఎంపిక ఉండడంతో.. తదుపరి విడత కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుందో తెలియని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్‌లో మినహా ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కౌన్సెలింగ్‌ విధానం లేదని వైద్యవర్గాలే తెలిపాయి.

ఏకరూప రుసుము మేలు

అన్ని కళాశాలలకు ఐచ్ఛికాలివ్వాలనే తప్పనిసరి నిబంధన కారణంగా.. ఒక విద్యార్థికి ప్రాధాన్యక్రమంలో మొదటి విడతలో ఆర్మీ దంత వైద్యకళాశాలలో సీటొచ్చింది. ఇక్కడ రుసుము ఏడాదికి రూ.4.25 లక్షలు. నిజానికి ఇందులో చేరాలనే ఆలోచన ఆ విద్యార్థికి లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫీజు కట్టి చేరాల్సి వచ్చింది. లేదంటే రెండోవిడత ప్రవేశాలకు అర్హత కోల్పోతాడు. అదే ఇతర ప్రైవేటు వైద్యకళాశాలల్లో అయితే రూ.45 వేలతో ప్రక్రియ పూర్తయ్యేది. ప్రభుత్వ దంత కళాశాలలో అయితే రూ.10 వేలు కడితే సరిపోయేది. ఇప్పుడు రెండోవిడతలో ఎక్కడైనా వస్తుందో రాదో తెలియని అయోమయంలో ఇన్ని రూ.లక్షలు పోసి ఇక్కడ చేరాల్సిన అవసరం ఏమిటని ఆ విద్యార్థి ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంబీబీఎస్‌ విద్యార్థులది మరో వింత పరిస్థితి. ఒక విద్యార్థికి ప్రాధాన్య క్రమంలో ప్రైవేటు వైద్య కళాశాలలో సీటొచ్చింది. ఇక్కడ ఏడాది రుసుము కన్వీనర్‌ కోటాకు రూ.60వేలు. అయితే ప్రైవేటు వైద్యకళాశాలలు మాత్రం ఇతరత్రా అంశాల పేరు చెప్పి.. కనీసం రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ కూడా చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అసలు ఆ కళాశాలలో కొనసాగడానికే ఇష్టం లేని పరిస్థితుల్లో.. ముందస్తుగా ఇన్ని రూ.లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి చెల్లిస్తామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ చెల్లించినా.. రెండోవిడతలోనో.. మూడోవిడతలోనో మరో కళాశాలలో చేరాల్సి వస్తే.. ఆ రుసుమును తిరిగి చెల్లిస్తారో లేదో అనే అనుమానాలున్నాయి.

ఇదీ చూడండి: సంచలనంగా ‘కారేపల్లి’ కొవిడ్‌ బీమా పరిహారం స్వాహాపర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.