ETV Bharat / state

మళ్లీ రాయాలా..! గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల్లో కలవరం - గ్రూప్‌1 మెయిన్స్‌ అభ్యర్థుల్లో కలవరం

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల్లో కలవరం నెలకొంది. తుది పరీక్ష తర్వాత తాత్కాలిక కొలువుల్లో చేరాలనే ప్రణాళిక రూపొందించుకుంటే.. ప్రిలిమ్స్‌ రద్దుతో అంతా తారుమారైంది. దీంతో ఆర్థిక భారంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

TSPSC
TSPSC
author img

By

Published : Mar 19, 2023, 10:23 AM IST

రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌-1తో పాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు కమిషన్ రద్దు చేసింది. ఈ క్రమంలో ఉద్యోగార్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ముఖ్యంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్​లో అర్హత సాధించి.. మొయిన్స్‌కు సన్నద్ధమవుతున్న వారు.. ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరో మూడు నెలల్లో మెయిన్స్‌ పూర్తవుతుంది.. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తామన్న విశ్వాసంతో చదువుతున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మళ్లీ ప్రిలిమ్స్‌ రాయాలా? ఒకవేళ పొరపాటున గట్టెక్క లేకుంటే ఎలా? ఈ మధ్యలో ఇంకెన్ని పరిణామాలు సంభవిస్తాయో? అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో ఉంటూ పరీక్షకు సన్నద్ధం కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి సిద్ధమవ్వాలంటే నెలకు అన్నీ కలిపి రూ.10,000 ఖర్చు తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల రద్దుతో కనీసం మరో ఆరు నెలలు అదనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రిలిమ్స్‌ నెగ్గలేదని వెనక్కి వెళ్లిన వారు కూడా మళ్లీ పరీక్షకు సిద్ధమవుతారు. ఇలాంటి వారు చాలా మంది హైదరాబాద్‌కు చేరుకుంటారు. అంటే.. వారంతా మళ్లీ ఖర్చు పెట్టాల్సిందే. పరీక్షల రద్దుతో కోచింగ్ సెంటర్లకు, హాస్టళ్లు.. పుస్తకాల రచయితలు, వాటి పబ్లిషర్లు, వాటిని విక్రయించే వారికి మాత్రం లాభమేనని గాంధీనగర్‌లో ఉంటున్న పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.

జిల్లాలకు వెళ్లే ఆలోచనలో: నాలుగు పరీక్షలు రద్దవడంతో అనేక మంది సొంత జిల్లాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు ఇప్పటికే వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు.. గ్రూప్‌-1, 2లను సాధించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అనంతరం కుటుంబంతో సహా హైదరాబాద్‌ వచ్చారు. తాజా పరిణామంతో తిరిగి ఆయన ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిపోయారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పని చేస్తున్న ఒక ఉద్యోగి.. 20 మంది ఉండే హాస్టల్‌లో సంవత్సర కాలంగా ఉంటున్నారు. అక్కడ ఒక్కటే టాయిలెట్‌ ఉండేది. అపరిశుభ్రంగా ఉన్నా.. లక్ష్యం కోసం భరించారు. ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్లిపోయారు.

కొందరు మహిళలు పిల్లల్ని, భర్తను వదిలి గ్రూప్స్‌ లక్ష్యంతో హైదరాబాద్‌ వచ్చారని శిక్షణ నిపుణుడు ఒకరు తెలిపారు. ఇప్పుడు వారి భర్త అర్థం చేసుకున్నా.. అత్తామామలు అర్థం చేసుకుంటేనే పరీక్షలపై సరిగ్గా దృష్టి సారించగలరని ఆయన వివరించారు. హైదరాబాద్‌ నగరంలో రెండు రోజులుగా గ్రంథాలయాల్లోనూ నిరుద్యోగ అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థులు నిరాశకు గురికాకుండా మరింత పట్టుదలతో చదవాలని శిక్షణ నిపుణుడు కృష్ణ ప్రదీప్‌ సూచించారు.

ఇవీ చదవండి: TSPSC పరీక్షల రీషెడ్యూల్.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న కమిషన్‌

'దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే వారి దాడులు! అయినా ఆగేదే లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.